logo

భక్తులకు నిబంధనాలు

శ్రీశైలంలోని ఆలయం వెలుపల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ఐరన్‌ మెష్‌లను దేవస్థానం అధికారులు తొలగించకపోవడం భక్తులకు అసౌకర్యంగా మారింది.

Published : 31 Mar 2023 02:18 IST

ఉత్సవాల కోసం క్యూలైన్ల వెలుపల ఏర్పాటు చేసిన ఐరన్‌ మెష్‌లు

శ్రీశైలంలోని ఆలయం వెలుపల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ఐరన్‌ మెష్‌లను దేవస్థానం అధికారులు తొలగించకపోవడం భక్తులకు అసౌకర్యంగా మారింది. మహా శివరాత్రి, ఉగాది ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు రావడంతో రద్దీని క్రమబద్ధీకరించేందుకు దేవస్థానం అధికారులు ఆలయం వెలుపల ఉన్న క్యూలైన్లకు మెష్‌లు ఏర్పాటు చేశారు. ఉగాది ఉత్సవాలు ముగిసి వారం గడుస్తున్నా మెష్‌లను మాత్రం అలాగే వదిలేశారు. రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ క్యూలైన్ల వరుసల్లో వెల్లడం వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెష్‌ల వల్ల ఉచిత దర్శనం, రూ.150 శీఘ్ర దర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం క్యూలైన్లకు వెళ్లడానికి అసౌకర్యం కలుగుతోంది. ప్రస్తుతం ఉన్న క్యూలైన్లలో వెళ్లేందుకు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవస్థానం స్పందించి ఐరన్‌ మెష్‌లను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు