logo

కూలిపోకముందే.. నిలబెట్టండి

వర్షాలకు వంతెన వద్ద మట్టి కొట్టుకుపోయింది. దీంతో ప్రహరీ కాస్త కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. నిత్యం ఈ ప్రధాన రహదారిలో వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి.

Published : 02 Apr 2023 02:49 IST

వర్షాలకు వంతెన వద్ద మట్టి కొట్టుకుపోయింది. దీంతో ప్రహరీ కాస్త కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. నిత్యం ఈ ప్రధాన రహదారిలో వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. వంతెన వద్ద మట్టి లేకున్నా దాని గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. వర్షాకాలంలో ఉన్న కాస్త మట్టి కొట్టుకుపోతే వంతెన కూలిపోవడంతోపాటు ప్రధాన రహదారి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది ప్యాపిలి మండలంలోని రామకృష్ణాపురం-మాధవరం గ్రామాల మధ్యలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన కల్వర్టు వంతెన పరిస్థితి. అధికారులు స్పందించి ముందస్తు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, మాధవరం (ప్యాపిలి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని