logo

ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి తిప్పలు

డోన్‌ సీహెచ్‌సీ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. సౌకర్యాలు చూడటానికే తప్ప వాటిని వాడుకునేందుకు పనికి రావు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండటంతో రోగులు, వారి బంధువులు వీల్లేకుండా ఉన్నాయి.

Published : 02 Apr 2023 02:49 IST

డోన్‌ సీహెచ్‌సీ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. సౌకర్యాలు చూడటానికే తప్ప వాటిని వాడుకునేందుకు పనికి రావు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండటంతో రోగులు, వారి బంధువులు వీల్లేకుండా ఉన్నాయి. ఆసుపత్రికి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బాత్‌రూంల పక్కనే ఆరుబయట మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆసుపత్రికి వచ్చే వారి కోసం శుద్ధజలం అందించేందుకు ట్యాంకు ఏర్పాటు చేశారు. కానీ నీరు అందుబాటులో ఉండదు. ఆసుపత్రి బయట దుకాణాల వద్ద డబ్బులు వెచ్చించి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం ట్యాంకుకు నీరు రాకపోవటంతో అక్కడి రోగుల బంధువులు నీళ్ల సీసాలు, చిన్నపాటి బిందెలతో నీటిని కొనుగోలు చేసి తీసుకువచ్చామని వాపోయారు.

న్యూస్‌టుడే, డోన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు