logo

స్పాట్‌ వాల్యుయేషన్‌కు హాజరుకాకుంటే చర్యలు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌కు ప్రతి సబ్జెక్టు అధ్యాపకుడు హాజరుకావాలని ఆర్‌ఐవో గురువయ్య శెట్టి తెలిపారు.

Published : 02 Apr 2023 02:49 IST

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల స్పాట్‌ వాల్యుయేషన్‌కు ప్రతి సబ్జెక్టు అధ్యాపకుడు హాజరుకావాలని ఆర్‌ఐవో గురువయ్య శెట్టి తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ (టౌన్‌) కళాశాలలో స్పాట్‌ వాల్యుయేషన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు చెప్పారు. వాల్యుయేషన్‌కు హాజరు కాని అధ్యాపకులు 2వ తేదీన రిపోర్టు చేయకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.


డిగ్రీ పరీక్షల్లో ఆరుగురి డిబార్‌

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన 1, 5 సెమిస్టర్‌ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబారైనట్లు వీసీ ఆనందరావు తెలిపారు. 3వ సెమిస్టర్‌లో 4,644 మందికి విద్యార్థులకుగాను 4,093 మంది హాజరయ్యారన్నారు. 5వ సెమిస్టర్‌కు 4,216 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 3,802 మంది వచ్చినట్లు చెప్పారు.


దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు (వెంకటరమణ కాలనీ), న్యూస్‌టుడే: మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతులను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు సి.శ్యామల ఒక ప్రకటనలో కోరారు. దేశీయ మత్స్య శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో 1-5-23 నుంచి 31-7-23 వరకు నిర్వహించే శిక్షణ తరగతులకు నిరుద్యోగుల నుంచి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు 28వ తేదీలోపు దరఖాస్తులను మత్స్యశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. 29వ తేదీ ఉదయం      10.30కు కార్యాలయంలో నిర్వహించే ముఖాముఖికి ఒరిజినల్‌ పత్రాలు తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు మత్స్యశాఖ ఉప సంచాలకులను సంప్రదించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని