logo

డ్వామాలో 141 మంది బదిలీ

కర్నూలు జిల్లా పరిధిలోని డ్వామాలో భారీగా బదిలీలు జరిగాయి. హేతుబద్ధీకరణలో భాగంగా డ్వామా విభాగంలో అవసరానికి మించి అదనంగా పనిచేస్తున్న సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.

Published : 02 Apr 2023 02:49 IST

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా పరిధిలోని డ్వామాలో భారీగా బదిలీలు జరిగాయి. హేతుబద్ధీకరణలో భాగంగా డ్వామా విభాగంలో అవసరానికి మించి అదనంగా పనిచేస్తున్న సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. చాలీచాలని జీతంతో అంతదూరం వెళ్లి ఎలా బతకాలని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం తీసుకునేవారు ఇతర జిల్లాలకు వెళ్లేందుకు మొగ్గుచూపడం లేదు. డ్వామాలో మొత్తం 141 మంది బదిలీ అయ్యారు. అందులో టెక్నికల్‌ అసిస్టెంట్లు 81 మంది, సీవోలు 53, ఏపీవోలు 5, ఈసీలు 2 ఉన్నారు. వీరంతా సుదూర జిల్లాలకు బదిలీ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు