Theft: నంద్యాల జిల్లా.. వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

వ్యాపారి ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా అవుకు మండలంలో చోటుచేసుకుంది.

Updated : 02 Apr 2023 12:39 IST

అవుకు: నంద్యాల జిల్లాలో భారీ చోరీ జరిగింది. నాపరాళ్ల పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో దండగులు చొరబడి 80 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు దోచుకెళ్లారు. శనివారం రాత్రి అవుకు మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. 

ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు.. తలుపులకు వేసిన తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలో దాచిన బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అవుకు ఎస్సై జగదీశ్వరరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని