logo

త్వరితగతిన నాడు-నేడు పనులు

పాఠశాలలు తెరిచేలోపు నాడు-నేడు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. నాడు-నేడు పనుల పురోగతిపై పంచాయతీరాజ్‌, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూఐడీసీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్లతో కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షించారు.

Published : 30 May 2023 02:56 IST

ఇంజినీర్లతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ డా.జి.సృజన

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పాఠశాలలు తెరిచేలోపు నాడు-నేడు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. నాడు-నేడు పనుల పురోగతిపై పంచాయతీరాజ్‌, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూఐడీసీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్లతో కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షించారు. పనుల్లో జీరో పురోగతి సాధించిన ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్స్‌, చిన్నిపాటి మరమ్మతు పనులు కూడా చేయించలేకపోయారని మండిపడ్డారు. మిగిలిన ఏజెన్సీలతో పోలిస్తే పనుల నిర్వహణలో ఏపీఈడబ్ల్యూఐడీసీ పూర్తిగా వెనుకబడిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.   ఈ సమావేశంలో పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఏ పీవో వేణుగోపాల్‌, అన్ని శాఖల ఇంజినీర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని