logo

కూలీలందరికీ ఉపాధి పనులు చూపాలి

ఉపాధి హామీ పనులకు కూలీలను పూర్తిస్థాయిలో సమీకరించాలని.. వారందరికీ పనులు చూపాలని కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మంగళవారం సమీక్షించారు.

Published : 31 May 2023 03:39 IST

సచివాలయం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనులకు కూలీలను పూర్తిస్థాయిలో సమీకరించాలని.. వారందరికీ పనులు చూపాలని కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మంగళవారం సమీక్షించారు. వర్షాలు కురుస్తున్నాయని కారణాలు చెప్పకుండా మండలాలకు నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి పనులకు సంబంధించి తక్కువ శాతం పనిదినాలు జనరేట్‌ చేసిన నందవరం, ఎమ్మిగనూరు, గూడూరు మండలాల ఏపీడీలు పురోగతి సాధించాలన్నారు. ఆస్పరి, నందవరం, వెల్దుర్తి, కర్నూలు మండలాల్లో కూలీలకు సరాసరి వేతనం అందడం లేదన్నారు. ఎస్‌ఎంఎంఎస్‌ యాప్‌లో హాజరు తప్పనిసరిగా వేయాలని.. సదరు యాప్‌లో వెల్దుర్తి, కర్నూలు, దేవనకొండ, హొళగుంద, చిప్పగిరి మండలాల వివరాలు తక్కువ శాతం నమోదయ్యాయన్నారు. 2021-22 సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న 4,588 పనులకు సంబంధించిన పూర్తి వివరాలను ఏఈలు, ఎంపీడీవోలు వెంటనే అందజేయాలన్నారు.   అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవన నిర్మాణాలను పంచాయతీ నిధులతో పూర్తి చేసేలా అనుమతులు ఇవ్వాలని పంచాయతీరాజ్‌ అధికారులు కోరగా నివేదికలు తయారుచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని