logo

బీసీలకు తెదేపా అండ : సోమిశెట్టి

తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని మరోసారి చంద్రబాబు నాయుడు రుజువు చేశారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 31 May 2023 03:39 IST

ఎన్టీఆర్‌ విగ్రహం, చంద్రబాబు, జ్యోతిబాఫులె చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న సోమిశెట్టి తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని మరోసారి చంద్రబాబు నాయుడు రుజువు చేశారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మహానాడు వేదికగా ప్రకటించడంపై తెదేపా బీసీ సెల్‌ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు ఆధ్వర్యంలో సోమిశెట్టి, తెదేపా బీసీ నాయకులు రాజు యాదవ్‌, నందిమధు తదితరులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి, చంద్రబాబు, జ్యోతిబాఫులె చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సత్రం రామకృష్ణుడు మాట్లాడుతూ తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీకి బీసీలు వెన్నెముకగా ఉన్నారని చెప్పారు. తెదేపా నాయకురాళ్లు రమణమ్మ, విజయలక్ష్మి, చంద్రకళాబాయి, ఆశాలత, నాయకులు చెన్నకేశవులు, శివరావు, ఎల్లాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు సచివాలయం : మహానాడు విజయవంతం కావడంతో వైకాపా నాయకులకు మతిభ్రమించి చంద్రబాబును నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సోమిశెట్టి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక భాగాన్ని చంద్రబాబు ప్రకటించారని, ఇందులో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించారన్నారు. దీనిని వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. కొడాలి నానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ చంద్రబాబుపై అనుచితంగా మాట్లాడటాన్ని ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని