సీఎం సారూ.. మా నాన్నపై పీడీ యాక్ట్ ఎత్తేయండి
సీఎం సారూ.. మా నాన్న సుగాలి భామ్లానాయక్‌పై అనంతపురం జిల్లా, గుత్తి సెబ్ పోలీసులు పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసి, తమను ఆదుకోవాలని తుగ్గలి మండలం మిద్దెతండాకు చెందిన సుగాలి లలిత....
పోస్టర్లు చూపుతున్న భామ్లానాయక్ భార్య లలిత, పిల్లలు
పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: సీఎం సారూ.. మా నాన్న సుగాలి భామ్లానాయక్‌పై అనంతపురం జిల్లా, గుత్తి సెబ్ పోలీసులు పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసి, తమను ఆదుకోవాలని తుగ్గలి మండలం మిద్దెతండాకు చెందిన సుగాలి లలిత, పిల్లలు భాగ్యశ్రీ, మమతశ్రీ, హేమంత్‌నాయక్ కోరారు. పత్తికొండ పట్టణంలోని శ్రీశారదా వృద్ధాశ్రమంలో మంగళవారం భాజపా నియోజకవర్గ బాధ్యుడు ఈడిగ రంగాగౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మా తండ్రి భామ్లానాయక్ గతంలో సారా కాసేవారని, ఇప్పుడు సారా మానేసి పెయింట్ కొట్టే కూలి పనులకు వెళ్తుండేవాడన్నారు. గత నెల గుత్తి సెబ్ పోలీసులు తమ తండ్రి భామ్లానాయక్‌ను స్టేషన్‌కు పిలిపించుకుని రూ.50వేలు డబ్బులు ఇస్తావా? లేదా నీపై పీడీయాక్ట్ కేసు పెట్టాలా? అని సెబ్ సీఐ వరలక్ష్మి బెదిరించిందన్నారు. మాతో అంత డబ్బు లేదని చెప్పినా.. పట్టించుకోకుండా అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి జైలులో పెట్టించారని చిన్నారులు ఆవేదన వ్యక్తంచేశారు. కేసును కొట్టివేయించి, తమ తండ్రిని తమకు అప్పగించాలని వేడుకున్నారు. ఎస్టీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. సుగాలి భామ్లానాయక్‌పై అక్రమంగా పెట్టిన పీడీయాక్ట్‌ను రద్దు చేసి గుత్తి సెబ్ సీఐ వరలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా నాయకులు మల్లికార్జున, పూనా మల్లికార్జున, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
TTD: సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు