logo

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడి

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ప్రాంతీయ అధికారిణి నీలం పూజిత తమ సిబ్బందితో కలిసి బుధవారం ఉమ్మడి జిల్లాలోని ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు.

Published : 01 Jun 2023 02:34 IST

కర్నూలులో తనిఖీ చేస్తున్న ఆర్‌ఈవో నీలం పూజిత

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ప్రాంతీయ అధికారిణి నీలం పూజిత తమ సిబ్బందితో కలిసి బుధవారం ఉమ్మడి జిల్లాలోని ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. కర్నూలులోని అన్నపూర్ణ ట్రేడర్స్‌, ఎమ్మిగనూరులోని సాయిరాం ట్రేడర్స్‌, వెంకటేశ్వర ట్రేడర్స్‌, నంద్యాలలోని శ్రీచక్ర సీడ్స్‌, వెంకటేశ్వర సీడ్స్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ఎమ్మిగనూరులోని సాయిరాం ట్రేడర్స్‌ దుకాణంలో రూ.853కు విక్రయించాల్సిన యూఎస్‌ 7067 రకం పత్తి విత్తనాల ప్యాకెట్‌ను రూ.1,400కు అమ్ముతున్నట్లు గుర్తించారు. 140 ప్యాకెట్ల పత్తి విత్తనాలను సీజ్‌ చేశారు. కర్నూలులోని అన్నపూర్ణ  ట్రేడర్స్‌ దుకాణంలో ఆముదం విత్తనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు చూపకపోవటంతో నాలుగు క్వింటాళ్ల నిల్వలు సీజ్‌ చేశారు. దాడుల్లో సీఐలు నాగరాజుయాదవ్‌, కేశవరెడ్డి, సునీల్‌, వ్యవసాయాధికారి రూపస్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని