logo

పెద్ద పులి సంచారంతో ఆందోళన

మండలంలోని శ్రీశైలం ముంపు ప్రాంతమైన పాత బట్టువారిపల్లి సమీపంలో పెద్ద పులి సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఉదయం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన యువకుడు

Published : 01 Jun 2023 02:34 IST

పాదముద్రలు పరిశీలిస్తున్న అటవీ అధికారులు

కొత్తపల్లి, న్యూస్‌టుడే : మండలంలోని శ్రీశైలం ముంపు ప్రాంతమైన పాత బట్టువారిపల్లి సమీపంలో పెద్ద పులి సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఉదయం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఈశ్వర్‌ ద్విచక్ర వాహనంపై ముంపు ప్రాంతంలోని రహదారి గుండా పగిడ్యాల మండలంలోని ఘణపురానికి వెళుతుండగా మార్గమధ్యలో పాత బట్టువారిపల్లి సమీపంలో పెద్ద పులి కనిపించిందని గ్రామస్థులకు చెప్పారు. తాను వెనుదిరిగి కొంతదూరం వచ్చి చూడగా ఎద్దులేరువాగు వైపు వెళుతూ కనిపించినట్లు ఆ యువకుడు వివరించారు. దీంతో జడ్డువారిపల్లి, సింగరాజుపల్లి, ముసలిమడుగు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు దాడి చేస్తుందోనని ఆందోళనలో మునిగిపోయారు. ఆదుకోవాలని వినవిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలు పరిశీలించారు. గొర్రెలు, మేకలు తిరగడంతో పాదముద్రలు చెదిరిపోయాయని, గురువారం ఉదయాన్నే వచ్చి మళ్లీ పాదముద్రలు పరిశీలిస్తామని ఎఫ్‌ఎస్‌వో నాగేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని