logo

పది సప్లిమెంటరీకి పకడ్బందీ చర్యలు

జూన్‌ 2 నుంచి 10 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయన బుధవారం తన ఛాంబర్‌లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

Published : 01 Jun 2023 02:34 IST

సమీక్షిస్తున్న డీఆర్వో నాగేశ్వరరావు, పక్కన డీఈవో రంగారెడ్డి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జూన్‌ 2 నుంచి 10 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయన బుధవారం తన ఛాంబర్‌లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయన్నారు. జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో 11,535 మంది హాజరుకానున్నారని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని డీఈవో రంగారెడ్డికి సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ఏర్పాటు చేయడంతోపాటు బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్ష రాసేందుకు వచ్చే ప్రతి విద్యార్థిని పరిశీలించి అనుమతించాలన్నారు. పరీక్షలకు 61 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మూడు ఫ్లయింగ్‌ స్వ్కాడ్స్‌, 610 ఇన్విజిలేటర్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌(పరీక్షలు) చంద్రభూషణం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని