logo

ప్రతి గ్రామంలో ఉల్లి ప్రాసెసింగ్‌ యూనిట్లు

పత్తికొండ ప్రాంతానికి ఎమ్మెల్యే శ్రీదేవి కోరిన మీదట పలు ప్రాజెక్టులకు హామీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Published : 02 Jun 2023 02:00 IST

చెరువులు నింపే ప్రాజెక్టు త్వరలో జాతికి అంకితం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు, కర్నూలు : పత్తికొండ ప్రాంతానికి ఎమ్మెల్యే శ్రీదేవి కోరిన మీదట పలు ప్రాజెక్టులకు హామీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పత్తికొండలోని సెయింట్‌ జోసఫ్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాల ఆవరణలో వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధుల విడుదల, ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల కార్యక్రమానికి గురువారం హాజరై మాట్లాడారు.  గాజులదిన్నె జలాశయంలో 4 టీఎంసీలు నిల్వ ఉండేలా పనులు పూర్తి చేశామని.. పత్తికొండ నియోజకవర్గంలో ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించేలా పత్తికొండ జలాశయం వద్ద రూ.80 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కాలువ నుంచి 68 చెరువులు నింపే ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని.. జులైలోగానీ.. ఆగస్టులో జాతికి అంకితం చేస్తామన్నారు. బీసీ బాలికల సంక్షేమ భవనం నిర్మాణానికి రూ.1.75 కోట్లు మంజూరు చేస్తున్నామని.. గోకులపాడులో రూ.7.5 కోట్లతో హైలెవల్‌ వంతెన మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాగీ సంస్థతో మాట్లాడి ఉల్లిపాయల పొడి తయారు చేసే యూనిట్లు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయనున్నామన్నారు. రూ.140 కోట్లతో సిల్వర్‌ జూబ్లీ కళాశాల భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమం అనంతరం రైతులు ముఖ్యమంత్రికి నాగలి బహూకరించారు. రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ చెక్కులను రైతులకు అందించారు.


రెండేళ్లలోనే నాలుగేళ్ల అభివృద్ధి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రెండేళ్లపాటు కరోనా కష్టకాలం వచ్చిందని.. మిగతా రెండేళ్లలో నాలుగేళ్ల అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. హోసూరు-మొలగవల్లి రోడ్డు పనులను రూ.7 కోట్లతో ప్రారంభించామన్నారు. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పత్తికొండ పట్టణ రహదారుల విస్తరణ నెల రోజుల క్రితమే ప్రారంభించగలిగామని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని