శ్రీమఠంలో ద్వాదశి పూజలు
ద్వాదశి సందర్భంగా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో విశేష పూజలు నిర్వహించారు. మరోవైపు ద్వాదశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
మంత్రాలయం, న్యూస్‌టుడే: ద్వాదశి సందర్భంగా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో విశేష పూజలు నిర్వహించారు. మరోవైపు ద్వాదశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి బృందావనానికి జలాభిషేకం, పంచామృతాభిషేకం చేసి, బంగారు కవచాలు, విశేష పుష్పాలతో అలంకరించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు పూజా మందిరంలో జయ, దిగ్విజయ, మూల రాములకు పూజలు చేశారు. గ్రామ దేవత మంచాలమ్మకు, రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి మంగళహారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు బంగారు పల్లకి సేవ, చెక్క, బంగారు, నవరత్న రథోత్సవంపై అశేష జనవాహిని మధ్య ఊరేగించారు. అనంతరం ఊంజల సేవ జరిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ukraine Crisis: భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్
-
Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు
-
Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
-
Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్ ఖాన్
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Hyundai i20 N Line: హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్.. ధర, ఫీచర్ల వివరాలివే!