logo

రెట్టింపు భారం

భూములు, స్థలాల మార్కెట్‌ విలువలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎవరూ ఊహించని విధంగా పలు ప్రాంతాల్లో విలువలు రెట్టింపు చేసింది.

Published : 02 Jun 2023 02:00 IST

భూముల మార్కెట్‌ విలువలు భారీగా పెంపు
ఆందోళనలో జనం

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, న్యూస్‌టుడే: భూములు, స్థలాల మార్కెట్‌ విలువలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎవరూ ఊహించని విధంగా పలు ప్రాంతాల్లో విలువలు రెట్టింపు చేసింది. 10 నుంచి 40 శాతం వరకు మాత్రమే పెంచుతున్నట్లు అధికారులు చెప్పిన మాటలకు.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పెంచిన విలువలు చూస్తే ఏమాత్రం పొంతన లేదని తెలుస్తోంది. గురువారం సవరించిన విలువలు చూసి అంతా నిర్ఘాంతపోయారు. ఒకవైపు చెంపదెబ్బ, మరోవైపు గోడదెబ్బ అన్నట్లు భవనాలు, స్థలాల విలువలతోపాటు భవనాల విలువలు సవరించి పరోక్షంగా రిజిస్ట్రేషన్‌ రుసుములను భారీగా పెంచేసి సామాన్య, మధ్య తరగతి వర్గాలపై ప్రభుత్వం పెనుభారం మోపింది.

భవనాల విలువ సవరింపు

స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవనాల విలువలు పెంచేసింది. నగర, పట్టణ, పంచాయతీలవారీగా భవనాల విలువలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇళ్లు, బహుళ అంతస్తులు, దుకాణాలు, వాణిజ్య.. ఇతర భవనాల రిజిస్ట్రేషన్‌ రుసుములు భారీగా పెరిగాయి. గతేడాది భవనాల విలువ పెంచిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు పెంచటం గమనార్హం.

కర్నూలు నగరంలో ఇలా..

కర్నూలు అశోక్‌నగర్‌లోని వాణిజ్య ప్రదేశాల్లో చదరపు గజం రూ.15 వేలు ఉండగా ఇప్పుడు రూ.30 వేలకు, జొహరాపురంలో రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరిగింది. కర్నూలు మండలం బి.తాండ్రపాడులో చదరపు గజం విలువ రూ.1,800 ఉండగా ప్రస్తుతం రూ.3,500కు, మామిదాలపాడులో చదరపు గజం రూ.6 వేలు ఉండగా రూ.10 వేలకు పెరగడం గమనార్హం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇలానే భూములు, స్థలాల విలువలు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని