logo

న్యాయ రాజధాని పేరుతో మోసం

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ఆర్భాటంగా ప్రకటించారని.. ఆ తర్వాత పట్టించుకోకుండా జిల్లావాసులు, రాయలసీమ ప్రాంతవాసుల్ని ముఖ్యమంత్రి మోసం చేశారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా బాధ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

Published : 02 Jun 2023 02:00 IST

సీఎంపై సోమిశెట్టి ధ్వజం

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ఆర్భాటంగా ప్రకటించారని.. ఆ తర్వాత పట్టించుకోకుండా జిల్లావాసులు, రాయలసీమ ప్రాంతవాసుల్ని ముఖ్యమంత్రి మోసం చేశారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా బాధ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కర్నూలులో న్యాయరాజధాని ఏమైందంటూ కర్నూలు జిల్లా తెదేపా న్యాయ విభాగం అధ్యక్షులు కె.ఇ.జగదీష్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట గురువారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు. రాష్ట్ర లీగర్‌ సెల్‌ ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కార్యక్రమాలకు హాజరవుతున్నారని నిలదీశారు. రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ న్యాయవాదులను మోసం చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలను మోసం చేయడం పెద్ద విషయం కాదన్నారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసభట్‌ మాట్లాడారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అడ్డుకున్న వైకాపా న్యాయవాదులు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఎలా స్వాగతం పలుకుతున్నారని నిలదీశారు. కార్యక్రమంలో నగర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు సుబాన్‌, న్యాయవాదులు యు.వి.లక్ష్మి, విజయలక్ష్మి, మాధవి, హరినాథ్‌చౌదరి, శ్రీహరి, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని