logo

రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి

రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని జడ్పీ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.

Published : 03 Jun 2023 01:57 IST

రైతులకు చెక్కు అందజేస్తున్న జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని తదితరులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని జడ్పీ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. కర్నూలు నగరం బళ్లారి రహదారిలో సెయింట్‌ క్లారెట్‌ పాఠశాలలో శుక్రవారం వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద 159 రైతు బృందాలకు 96 ట్రాక్టర్లు, ఒక హార్వెస్టర్‌, 442 ఇతర వ్యవసాయ పరికరాలు, రూ.4.61 కోట్ల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మేయర్‌ బి.వై.రామయ్య, కలెక్టర్‌ డా.జి.సృజన హాజరయ్యారు. పాపిరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందజేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ భరోసా కేంద్రాలలో ట్రాక్టర్‌, పరికరాలు తీసుకోకపోతే వాటిని వేరొక మండలానికి బదిలీ చేయడం, ఇంకొక ట్రాక్టర్‌ అవసరం ఉంటే వారికి ఏ విధంగా అందించాలి అనే అంశాలను పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ డా.జి.సృజన మాట్లాడుతూ రైతుల జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు బెల్లం మహేశ్వరరెడ్డి, కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డు అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీఏవో వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని