logo

153 రైతు సంఘాలకు ట్రాక్టర్లు, యంత్రాలు

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 153 గ్రూపులకు రూ.5.45 కోట్ల రాయితీతో 114 ట్రాక్టర్లు, నాలుగు వరి కోత యంత్రాలు అందించినట్లు కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ తెలిపారు.

Published : 03 Jun 2023 01:57 IST

జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా,  కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ తదితరులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 153 గ్రూపులకు రూ.5.45 కోట్ల రాయితీతో 114 ట్రాక్టర్లు, నాలుగు వరి కోత యంత్రాలు అందించినట్లు కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ తెలిపారు. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అందించే కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఒక్కో ట్రాక్టర్‌ ధర రూ.15 లక్షలు కాగా ఇందులో 50 శాతం బ్యాంకు రుణం, 40 శాతం రాయితీపోనూ కేవలం 10 శాతం మాత్రమే రైతు గ్రూపు భరిస్తుందని తెలిపారు. మొత్తం 153 రైతు గ్రూపులకు రూ.5.45 కోట్ల రాయితీ మొత్తాన్ని జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ మండలి ఛైర్మన్‌ భరత్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు బృందంగా ఏర్పాటై రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకుంటే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా మాట్లాడుతూ విత్తు నుంచి పంట కోత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, జేసీ నిశాంతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌ రావు, ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు, పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైతులకు చెక్కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని