logo

భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలి

ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియలో పాఠశాల సహాయకుల తెలుగు, హిందీ ఖాళీలను బ్లాక్‌ చేయకుండా అన్ని ఖాళీలను చూపించి తెలుగు, హిందీ భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 01:57 IST

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ 1938  రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియలో పాఠశాల సహాయకుల తెలుగు, హిందీ ఖాళీలను బ్లాక్‌ చేయకుండా అన్ని ఖాళీలను చూపించి తెలుగు, హిందీ భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందీ, తెలుగు పాఠ్యాంశాల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నందున నూతనంగా మంజూరు చేసిన పాఠశాలలకు కేటాయించడం లేదన్నారు. తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు చాలా తక్కువ ఖాళీలు ఉండడంతో సుదీర్ఘకాలం నుంచి దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి మంచి స్థానాలు దక్కని పరిస్థితి నెలకొందన్నారు. నూతనంగా మంజూరైన తెలుగు 250, హిందీ 153 పోస్టులను అప్‌గ్రేడ్‌ చేశారని, ఆ ఖాళీలను ప్రస్తుత బదిలీల్లో చూపించకుండా బ్లాక్‌ చేయడం దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, సభ్యులు పుల్లయ్య, పవన్‌కుమార్‌, మునిస్వామి, వెంకటేశ్వర్లు, గోపాలరావు, మద్దిలేటి  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని