logo

వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం

రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.

Updated : 04 Jun 2023 04:38 IST

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు

సీఎంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని సీఆర్‌ భవన్‌లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. నాలుగేళ్ల వైకాపా పరిపాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో దేశాన్ని అథోగతి చేసిందని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి ఎస్‌.ఎన్‌.రసూల్‌, జగన్నాథం, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నగర శివారులో ఇందిరమ్మ ఇళ్లు, టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కలెక్టర్‌ డా.జి.సృజనను కలిసి వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని