logo

ఆడిట్‌ శాఖలో బదిలీల గోల

ఆడిట్‌ శాఖలో బదిలీల గందరగోళం నెలకొంది. రాయలసీమ జిల్లాల్లోని 36 మంది ఏఏవోలు, సీనియర్‌ ఆడిటర్లకు స్టేట్‌ ఆడిట్‌ శాఖలో కర్నూలు ప్రాంతీయ ఉప సంచాలకులు కౌన్సెలింగ్‌ నిర్వహించి మే 31న బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 04 Jun 2023 04:41 IST

మే 31న ఆర్‌డీడీ ఉత్తర్వులు

అవి కుదరదన్న డైరెక్టర్‌

కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఆడిట్‌ శాఖ ఉద్యోగులు, ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఆడిట్‌ శాఖలో బదిలీల గందరగోళం నెలకొంది. రాయలసీమ జిల్లాల్లోని 36 మంది ఏఏవోలు, సీనియర్‌ ఆడిటర్లకు స్టేట్‌ ఆడిట్‌ శాఖలో కర్నూలు ప్రాంతీయ ఉప సంచాలకులు కౌన్సెలింగ్‌ నిర్వహించి మే 31న బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర సంచాలకుడు (ఎఫ్‌ఏసీ) ఆర్‌.హరిప్రకాష్‌ ఆర్‌డీడీ బదిలీ ఉత్తర్వులు కాదని.. 58 మందిని బదిలీ చేస్తూ శనివారం మెయిల్‌ ద్వారా ఉత్తర్వులు పంపారు.  

వారిని విధుల్లోకి తీసుకోవద్దంటూ..

ఆర్‌డీడీ బదిలీ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దని ఆడిట్‌ శాఖ రాష్ట్ర సంచాలకుడు (ఎఫ్‌ఏసీ) ఆర్‌.హరిప్రసాద్‌ జిల్లా ఆడిట్‌ అధికారులను ఆదేశించారు. జూన్‌ 1 నుంచి బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ తనకు అనుకూలమైన వారికి నచ్చిన స్థానాలకు... ఇతరులు, వ్యతిరేకులను సుదూర ప్రాంతాలకు డైరెక్టర్‌ బదిలీ చేస్తూ మెయిల్‌ ద్వారా శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు పంపారు. ఎన్జీవో సంఘం ఆఫీస్‌ బేరర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఈ సాధారణ బదిలీల్లో సడలింపు ఇచ్చింది.. వారిని సైతం బదిలీ చేశారని ఉద్యోగులు పేర్కొన్నారు.

నిబంధనలు తుంగలో తొక్కి..

ఆర్‌డీడీ బదిలీ ఉత్తర్వులను రద్దు చేసి ఇష్టానుసారంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్‌-4 రాయలసీమలో 36 మందిని మే 31 నాటికి బదిలీ చేస్తూ ఆర్‌డీడీ ఉత్తర్వులు జారీ చేయగా.. అదే రాష్ట్ర సంచాలకులు కేవలం మూడు నెలల సర్వీసు, 10 నెలల సర్వీసు ఉన్నప్పటికీ వాటన్నింటిని లెక్క చేయకుండా ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి బదిలీ చేయడం గమనార్హం.

కావాల్సిన వారిని నచ్చిన స్థానాలకు..

అడ్మినిస్ట్రేషన్‌ గ్రౌండ్స్‌ అనే సాకుతో తనకు అనుకూలమైన వారిని బదిలీ ఆప్షన్‌ ఇవ్వకపోయినా... ఆయా స్థానాలకు రిక్వెస్ట్‌ చేసుకోకున్నా.. బదిలీ కోసం దరఖాస్తు చేసుకోకపోయినా వారికి నచ్చిన స్థానాలకు బదిలీ చేశారు. నచ్చని వారిని వ్యక్తిగత కక్షతో సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీల విషయంలో రాష్ట్ర డైరెక్టర్‌ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆడిట్‌ శాఖ, ఎన్జీవో సంఘం నాయకులు రెండు రోజుల కిందట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి విన్నవించారు.  

* ఆర్‌డీడీ అధికారాలను తోసిపుచ్చి డైరెక్టర్‌ సొంతంగా బదిలీలు చేస్తున్నారని, ఇద్దరు సీనియర్‌ ఆడిటర్లను సస్పెండ్‌ చేశారంటూ 15 మంది ఉద్యోగులు మంత్రి బుగ్గనకు విన్నవించారు. తనపై ఆర్థిక శాఖ మంత్రికే ఫిర్యాదు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన 8 మంది ఎన్జీవో సంఘం ఆఫీస్‌ బేరర్లు, ఏడుగురు అసోసియేషన్‌ సభ్యులు కలిపి మొత్తం 15 మందిని తితిదే, ఎస్వీ యూనివర్సిటీ తదితర సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

* షణ్ముఖరాజు అనే వ్యక్తి తిరుపతి నుంచి కర్నూలుకు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆర్డీడీ కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతిలో రిలీవ్‌ అయి కర్నూలు రాగా కర్నూలు డీఏవో విధుల్లోకి తీసుకోలేదు. ఆలోగా డైరెక్టర్‌ షణ్ముఖరాజును నంద్యాల జిల్లాకు బదిలీ చేస్తూ శనివారం మెయిల్‌ ద్వారా పాత తేదీ వేస్తూ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు.

ముడుపులు తీసుకున్నారు..

* ఒక సీనియర్‌ ఆడిటర్‌కు ఒకే రోజు ఏఏవోగా పదోన్నతి కల్పిస్తూ అదే రోజు జిల్లా ఆడిట్‌ అధికారిగా ఉత్తర్వులు జారీ చేసిన ఘనత డైరెక్టర్‌ దక్కింది. ఈ పదోన్నతి, డీఏవోగా నియమించడం కోసం రూ.లక్షలు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఉద్యోగులు పేర్కొన్నారు. ముడుపులు తీసుకుని కొత్త జిల్లాలకు పలువురిని ఇన్‌ఛార్జి డీఏవోలుగా నియమించారని.. సీనియారిటీ పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా పోస్టింగులు ఇచ్చారని వాపోయారు.

* ఆర్‌డీడీ అధికారాలను తోసిపుచ్చి డైరెక్టర్‌ సొంతంగా బదిలీలు చేస్తున్నారని, ఇద్దరు సీనియర్‌ ఆడిటర్లను సస్పెండ్‌ చేశారంటూ 15 మంది ఉద్యోగులు మంత్రి బుగ్గనకు విన్నవించారు. తనపై ఆర్థిక శాఖ మంత్రికే ఫిర్యాదు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన 8 మంది ఎన్జీవో సంఘం ఆఫీస్‌ బేరర్లు, ఏడుగురు అసోసియేషన్‌ సభ్యులు కలిపి మొత్తం 15 మందిని తితిదే, ఎస్వీ యూనివర్సిటీ తదితర సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

* షణ్ముఖరాజు అనే వ్యక్తి తిరుపతి నుంచి కర్నూలుకు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆర్డీడీ కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతిలో రిలీవ్‌ అయి కర్నూలు రాగా కర్నూలు డీఏవో విధుల్లోకి తీసుకోలేదు. ఆలోగా డైరెక్టర్‌ షణ్ముఖరాజును నంద్యాల జిల్లాకు బదిలీ చేస్తూ శనివారం మెయిల్‌ ద్వారా పాత తేదీ వేస్తూ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు.
      
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని