వారం రోజుల్లో పరిహారం పంపిణీ
జాతీయ రహదారులకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, రవాణా, ర.భ.శాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు.
సమీక్షిస్తున్న పీఎస్ ప్రద్యుమ్న, చిత్రంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జాతీయ రహదారులకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, రవాణా, ర.భ.శాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్‌లో జాతీయ రహదారులకు భూ సేకరణపై కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ నిశాంతితో కలిసి శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు సంబంధిత ప్రాజెక్టుల పనుల్ని రైతులు అడ్డుకోకుండా పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్‌హెచ్ 340బీలో భాగంగా సోమయాజులపల్లె నుంచి డోన్ వరకు నాలుగు వరుసల రహదారికి సేకరించిన 52.74 హెక్టార్ల భూములకు నెల రోజుల్లో 3జీ అవార్డులు పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డోన్ ఆర్డీవో వెంకటరెడ్డిని ఆదేశించారు. ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారికి సంబంధించి ప్యాకేజీ-4 కింద కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు సేకరించిన భూములకు పరిహారం చెల్లించేందుకు మార్కెట్ ధర నిర్ణయించి రైతులకు అవగాహన కల్పించాలని జేసీకి సూచించారు. జాతీయ రహదారి 340సీకి సంబంధించి నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వరకు భూములు ఇచ్చిన రైతులకు రూ.40 కోట్ల పరిహారం మొత్తాన్ని వారం రోజుల్లో అందజేయాలని జాతీయ రహదారి పీడీ తరుణ్‌ను ఆదేశించారు. సమావేశంలో ర.భ.శాఖ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, ఎన్‌హెచ్ పీడీలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Rahul Gandhi: విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం.. బీఎస్పీ ఎంపీని కలిసిన రాహుల్
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
IND vs AUS: ఆసీస్‌పై భారత్ విజయం.. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యం