వైభవంగా శ్రీవారి రథోత్సవ ఊరేగింపు
ఆదోని పట్టణంలో తితిదే ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్, శ్రీవారి భక్తుల సహకారంతో శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవ ఊరేగింపు ఆదివారం వైభవంగా జరిగింది.
ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో తితిదే ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్, శ్రీవారి భక్తుల సహకారంతో శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవ ఊరేగింపు ఆదివారం వైభవంగా జరిగింది. స్థానిక మంగళ ఆంజనేయస్వామి ఆలయం నుంచి భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. ఝాన్సీ రాణి, ఛత్రపతి శివాజీ మహారాజ్, శ్రీకృష్ణదేవరాయ వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి అలంకరణలో చిన్నారులు మైమరిపించారు. పురపాలక మైదానం వరకు ఊరేగింపు కొనసాగింది. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బసవన్న గౌడ్, ధర్మ ప్రచార పరిషత్, తితిదే జిల్లా కార్యనిర్వాకులు మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్‌తో పాటు పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం
-
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్
-
Rajinikanth: కరుణానిధి సంభాషణలా.. అమ్మబాబోయ్!