ఫుట్‌బాల్... గోల్‌పైనే గురి
పేదింటి బిడ్డలు ఫుట్‌బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. లక్ష్య సాధనకు కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో పతకాలు సాధిస్తున్నారు.
జాతీయస్థాయిలో రాణిస్తున్నవిద్యార్థులు
న్యూస్‌టుడే,ఎమ్మిగనూరు
పేదింటి బిడ్డలు ఫుట్‌బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. లక్ష్య సాధనకు కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో పతకాలు సాధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతోపాటు ఆటల్లోనూ ఆరితేరుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులు రెండు రోజుల క్రితం ఏపీ జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
సెంటర్ ఫార్వర్డ్‌లో సత్తా
ఎమ్మిగనూరుకు చెందిన నడవలయ్య ఇంటర్ చదువుతూ మరోవైపు కూలీ పనులకు వెళ్తుంటారు. ఆటలపై ఆసక్తితో పీఈటీ నరసింహరాజు శిక్షణతో ఫుట్‌బాల్‌లో రాణిస్తున్నారు. ఆటలో సెంటర్ ఫార్వర్డ్‌లో ఎదుటి జట్టును గోల్ చేయకుండా అడ్డుగోడలా నిలవడంలో నిష్ణాతులు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ నెల 7 నుంచి జరుగనున్న పోటీల్లో ఏపీ జట్టు తరఫున తలపడనున్నారు. గతంలోనూ ఏపీ జట్టులో కర్నూలులో జరిగిన పోటీల్లో పాల్గొని ఉత్తమ క్రీడాకారునిగా నిలిచారు. 2021లో రాష్ట్ర స్థాయి పోటీల విభాగంలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన పోటీల్లో పాల్గొని విజయవాడ, గుంటూరు జట్లను ఒడించడంలో కీలకంగా వ్యవహరించి అవార్డును అందుకున్నారు. అదే ఏడాది వైఎస్సార్ జిల్లా పుట్టంపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. సబ్ జూనియర్ విభాగంలో 2019లో ముంబయిలో జరిగిన నేషనల్ ఫుట్‌బాల్ క్రీడా పోటీలకు ఏపీ జట్టు తరఫున ఆడారు. కోల్‌కత్తా, మిజోరాం జట్లను ఓడించడంలో ప్రతిభ కనబరిచి ఉత్తమ క్రీడాకారునిగా అవార్డు తీసుకున్నారు.
ఉత్తమ క్రీడాకారునిగా ప్రతిభ
పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థి సిద్ధూ ఆరేళ్లుగా ఫుట్‌బాల్ పోటీల్లో రాణిస్తున్నారు. ప్రతిరోజూ మైదానంలో మూడు గంటలపాటు సాధన చేసి మెలకువలు నేర్చుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారు. జూనియర్ అండర్-19 విభాగంలో మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 2019, 2021, 2022, 2023లో నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలులో జరిగిన పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ క్రీడాకారునిగా అవార్డు తీసుకున్నారు. ముంబయిలో 2019లో జరిగిన జాతీయ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బెంగళూరులో జరిగిన సబ్ జూనియర్ విభాగంలోనూ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు