పంచాయతీలకు నిధుల్లేకే..ఈ అవస్థలు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు అందాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో పాటు కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇతర వాటికి మళ్లించడం తదితర కారణాలతోనే పంచాయతీలకు ఈ దుస్థితి తలెత్తిందని అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అన్నారు.
తుగ్గలి సర్పంచికి సన్మానం
తుగ్గలి సర్పంచి రామాంజనేయులు దంపతులను సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి
పత్తికొండ, తుగ్గలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు అందాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో పాటు కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇతర వాటికి మళ్లించడం తదితర కారణాలతోనే పంచాయతీలకు ఈ దుస్థితి తలెత్తిందని అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సైతం వేతనాలు చెల్లించలేక తుగ్గలి గ్రామంలో సర్పంచి రామాంజనేయులు స్వయంగా తానే కాలువల్లోని పూడిక తొలగించి, పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జేసీ ప్రభాకరరెడ్డి శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర, పత్తికొండ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్‌రెడ్డి తదితరులతో కలిసి మంగళవారం తుగ్గలి సర్పంచి రామాంజనేయులు దంపతులను ఘనంగా సత్కరించారు. వారికి దుస్తులు అందజేశారు. ఈ సందర్బంగా వారు స్థానికులకు అవగాహన కల్పించారు. తనకు ఓట్లు వేసి గెలిపించినందుకు తన బాధ్యతగా భావించి సర్పంచి స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడిగా మారి ఇలా సేవలందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఏ సర్పంచి కార్మికునిగా మారి స్వయంగా పనులు చేసే పరిస్థితిలో లేరని, ఈయన చేయడం అభినందనీయమన్నారు. శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర సహకారంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి అత్యధిక ఓట్లతో విజయం సాధించిన సర్పంచిగా రామాంజనేయులు పేరు సంపాదించుకున్నారు. అనంతరం తుగ్గలి నాగేంద్ర ఇంటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులను జేసీ అడిగి తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyundai i20 N Line: హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్.. ధర, ఫీచర్ల వివరాలివే!
-
Tecno Phantom V Flip 5G: టెక్నో నుంచి రూ.50 వేల ఫ్లిప్ ఫోన్.. ఫీచర్లివే..!
-
Parineeti- Raghav Chadha: పరిణీతి- రాఘవ్ చద్దా పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్
-
ICC U19 World Cup 2024: అండర్ -19 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది
-
Priyamani: ‘జవాన్ 2’లో విజయ్!.. ప్రియమణి ఏమన్నారంటే?
-
PM Modi: ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది: మోదీ