logo

ఉపాధి పనుల్లో పురోగతి తప్పనిసరి

ఉపాధి పనుల పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మంగళవారం సమీక్షించారు.

Published : 07 Jun 2023 02:37 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.జి.సృజన

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఉపాధి పనుల పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో 60 శాతం వివరాలు నమోదు చేసిన కల్లూరు, దేవనకొండ, చిప్పగిరి, కర్నూలు, కోడుమూరు మండలాల సిబ్బంది అలసత్వం వహించకుండా పూర్తిస్థాయిలో పురోగతి సాధించాలన్నారు. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలన్నారు. కల్లూరు, వెల్దుర్తి, హొళగుంద మండలాలకు సంబంధించి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో హాజరు శాతం తక్కువగా నమోదు చేశారన్నారు. సాంకేతిక కారణాలు చూపకుండా హాజరు శాతం నమోదు చేయాలని ఏపీడీలను ఆదేశించారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న పనులను పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు సమన్వయం చేసుకొని పూర్తి చేయాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు సంబంధించి రైతుల భూములను గుర్తించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. మినీ గోకులం పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీపీవో నాగరాజునాయుడు, డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని