logo

రూ.20 లక్షల విలువైన వెండి సామగ్రి స్వాధీనం

ఆదోని కొత్త బస్టాండు సమీపంలో మంగళవారం రాత్రి రూ.20 లక్షల విలువచేసే వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస నాయక్‌ తెలిపారు.

Published : 07 Jun 2023 02:37 IST

స్వాధీనం చేసుకున్న వస్తువులు చూపుతున్న సీఐ శ్రీనివాస్‌నాయక్‌

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని కొత్త బస్టాండు సమీపంలో మంగళవారం రాత్రి రూ.20 లక్షల విలువచేసే వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస నాయక్‌ తెలిపారు. ఆదోని పట్టణంలో రెండో పట్టణ పోలీసులు తనిఖీలు చేస్తుండగా మచిలీపట్నానికి చెందిన మహమ్మద్‌ ఆరీఫ్‌ అనే వ్యక్తి ఓ బ్యాగులో రూ.20 లక్షల విలువ చేసే 26.400 కిలోల వెండి ఆభరణాలు, బిస్కెట్లు తీసుకెళ్తుండగా గుర్తించి పట్టుకున్నామన్నారు. అతని వద్ద ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామన్నారు. వెండిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని