logo

అప్పులు తీసిన ఆయువు

అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. కోడుమూరు మండలం అల్లినగరానికి చెందిన మాదన్న (55) తనకున్న 2.5 ఎకరాల పొలంతోపాటు 8 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.

Updated : 08 Jun 2023 06:36 IST

 ఇద్దరు రైతుల బలవన్మరణం

కోడుమూరు గ్రామీణం, గూడూరు, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. కోడుమూరు మండలం అల్లినగరానికి చెందిన మాదన్న (55) తనకున్న 2.5 ఎకరాల పొలంతోపాటు 8 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న  పంటల సాగుకు రూ.9 లక్షల వరకు అప్పులు చేశారు. వర్షాభావ పరిస్థితులు, చేతికొచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక నిత్యం మనవేదనకు గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయనకు భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాసులు పేర్కొన్నారు.
* గూడూరు పట్టణానికి చెందిన తెలుగు నాగరాజు (54) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగరాజు తనకున్న 3 ఎకరాల సొంత పొలంతోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశారు. పంటలు సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు రూ.8 లక్షలు ఎలా తీర్చాలో తెలియక బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనుక నిర్మాణంలో ఉన్న ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ విక్టర్‌బాబు పేర్కొన్నారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు