రాజశేఖర్‌రెడ్డి హయాంలో అందరూ దోచుకుతిన్నారు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వచ్చేవని, ఇప్పుడు వైకాపాకు ఓటేసినందుకు అన్యాయం చేశారని ఓ బాధితుడు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌తో మొర పెట్టుకున్నాడు.
ఎమ్మెల్యేతో మాట్లాడుతున్న మద్దిలేటిరెడ్డి
కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వచ్చేవని, ఇప్పుడు వైకాపాకు ఓటేసినందుకు అన్యాయం చేశారని ఓ బాధితుడు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌తో మొర పెట్టుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆన్‌లైన్ విధానం లేకపోవడంతో ఎవరు పడితే వారు దోచుకుతిన్నారని పేర్కొన్నారు. బుధవారం కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మండలంలోని గోరంట్ల గ్రామానికి వెళ్లారు. అక్కడ గ్రామానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తి ఎమ్మెల్యేను కలిసి మాకు అమ్మ ఒడి రావడం లేదని, రైతుభరోసా పడలేదని విన్నవించారు. తన తల్లి పింఛను తీసుకుంటుండటంతో రావని చెప్పారని ఆయన అన్నారు. రేషన్ కార్డు తొలగించారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సిబ్బంది సూచన మేరకు రేషన్ కార్డులో తన తల్లిని, కూతురును తొలగిస్తే మళ్లీ కుమార్తె పేరును కార్డులో నమోదు చేస్తామన్నారు. వారు చెప్పినట్లు చేసినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ.. పైవిధంగా అంటూ వైఎస్ హయాంలో నాకు కూడా రేషన్ కార్డు ఉండిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్ మద్దతుదారులు
-
Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు
-
Flight Fares: భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్ ధరలకు రెక్కలు
-
Jaane Jaan Review: రివ్యూ: జానే జాన్.. కరీనా తొలి ఓటీటీ మూవీ మెప్పించిందా?