logo

మంచినీరు అడిగినందుకు..మహిళలను దూషించిన సర్పంచి అన్న

మా కాలనీలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, పబ్లిక్‌ కుళాయి ఏర్పాటు చేయాలని అడిగిన మహిళలను ఓ సర్పంచి అన్న అసభ్య పదజాలంతో దూషించిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటుచేసుకుంది.

Published : 08 Jun 2023 04:31 IST

పోలీస్‌స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

కోసిగి, న్యూస్‌టుడే: మా కాలనీలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, పబ్లిక్‌ కుళాయి ఏర్పాటు చేయాలని అడిగిన మహిళలను ఓ సర్పంచి అన్న అసభ్య పదజాలంతో దూషించిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళలు ఇటీవల ఖాళీ బిందెలతో తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బుధవారం కోసిగిలోని 9వ వార్డు బీరప్ప గుడి కాలనీవాసులు తమ కాలనీకి వచ్చిన వైకాపా నాయకుడు, సర్పంచి అయ్యమ్మ అన్న రాజేశ్‌ను తాగునీటి కోసం నిలదీశారు. దీంతో ఆయన వారిని ఇష్టారీతిన అసభ్యపదజాలంతో దూషించారు. మీకు బిందెలతో రోడ్డెక్కి ఆందోళన ఎవడు చేయమన్నాడు.. వాడి వద్దకే పోయి నీళ్లడగండని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనస్తాపం చెందిన మహిళలు శ్రీదేవి, ఈరమ్మ, మల్లమ్మ, అంపమ్మ, అల్లమ్మ, మంగమ్మ, లక్ష్మి తదితరులు కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. రాజేశ్‌పై ఫిర్యాదు చేయడానికి గంట సేపు నిరీక్షించినా ఎస్సై రాకపోవడంతో స్థానికంగా ఉన్న పోలీస్‌ సిబ్బంది వారి పేర్లు తీసుకున్నారు. తర్వాత ఇద్దరిని పిలుస్తాం.. అప్పుడు రండని ఇంటికి పంపించారు. దీంతో వారు చేసేదేమీలేక వెనుదిరిగి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని