logo

తెదేపాతోనే తెలుగు ప్రజలకు భవిష్యత్తు

తెదేపా ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి ప్రారంభించే ‘భవిష్యత్తుకు గ్యారంటీ తెదేపా కార్యక్రమం’ 150 రోజులపాటు జరగనుంది.

Published : 10 Jun 2023 02:46 IST

మాట్లాడుతున్న సోమిశెట్టి, పక్కన ఆకెపోగు ప్రభాకర్‌,పరిశీలకుడు శ్రీనివాసమూర్తి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : తెదేపా ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి ప్రారంభించే ‘భవిష్యత్తుకు గ్యారంటీ తెదేపా కార్యక్రమం’ 150 రోజులపాటు జరగనుంది.. ఎన్నికల ముందు చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌, కోడుమూరు-కర్నూలు నియోజకవర్గాల పార్టీ పరిశీలకుడు శ్రీనివాసమూర్తి అన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తుకు తెదేపా గ్యారంటీ ఇస్తుందన్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. నగరంలోని కార్యాలయంలో తెదేపా విస్తృతస్థాయి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీనివాసమూర్తి, నియోజకవర్గ ముఖ్యులు పాల్గొని తెదేపా ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలపై చర్చించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు తెదేపా ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు ఎంపీ, 14 ఎమ్మెల్యే స్థానాలను గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇద్దామని చెప్పారు. రెండో విడత మేనిఫెస్టోను దసరాకు చంద్రబాబు ప్రకటిస్తారని చెప్పారు.  సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు శివశంకర్‌ నాయుడు (కర్నూలు), సుధాకర్‌రెడ్డి (గూడూరు), గోవింద్‌ గౌడ్‌ (సి.బెళగల్‌), గజేంద్రగోపాల్‌ నాయుడు (గూడూరు టౌన్‌), కోడుమూరు నియోజకవర్గ నేతలు విజయకుమార్‌, షేక్షావలి, సి.బి.లత, కోడుమూరు సర్పంచి భాగ్యరత్న, నాయకులు సత్రం రామకృష్ణుడు, రామాంజినేయులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని