నకిలీ పత్రాలతో లబ్ధి పొందిందెవరు?
ఉద్యోగ సంఘం నాయకులంటూ నకిలీ పత్రాలు సమర్పించి బదిలీ కాకుండా ఉన్న వారిపై విచారణ మొదలైంది.
వివరాలు అందించాలని ప్రభుత్వం ఆదేశం
ఆందోళనలో ఉద్యోగులు
ఈనాడు, కర్నూలు : ఉద్యోగ సంఘం నాయకులంటూ నకిలీ పత్రాలు సమర్పించి బదిలీ కాకుండా ఉన్న వారిపై విచారణ మొదలైంది. అలాంటివారిని గుర్తించి వివరాలు పంపించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. సంఘాల్లో క్రియాశీలకంగా ఉంటూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్న వారికి బదిలీల్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వారు అందిస్తున్న సేవల నేపథ్యంలో బదిలీని కొంతకాలం వాయిదా వేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీన్ని కొందరు దుర్వినియోగం చేసినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. నకిలీ పత్రాలు అందించి బదిలీ కాకుండా చూసుకున్న వారి వివరాలు ఈనెల 14లోపు సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. వివరాలు ఎలా ఇవ్వాలన్న అంశాలపై ఒక పట్టిక నమూనాను రూపొందించారు.
ఆర్థిక లబ్ధి నేపథ్యంలో..
నగరంలో విధులు నిర్వర్తించేవారికి 16 శాతం హెచ్.ఆర్.ఎ. వస్తుందన్న విషయం తెలిసిందే. వీరు బదిలీ కాకుండా చూసుకుంటే ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అదనపు హెచ్.ఆర్.ఎ. రావడమేకాక దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అయ్యే ఖర్చు ఆదా చేసుకోవచ్చు. అన్నింటికీ మించి విలువైన సమయం కలసివస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పలువురు నకిలీ పత్రాలు సమర్పించడం.. పలు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో నకిలీ పత్రాలు జారీ చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య