పందికోనకు ప్రమాదం
పత్తికొండ మండలంలో పందికోన జలాశయంపై అక్రమార్కుల కన్నుపడింది. పొలాలకు సారవంతమైన మట్టి తరలింపు పేరుతో నిత్యం వందలాది ట్రాక్టర్లతో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమంగా మట్టి తరలింపు
తవ్వకాలతో జలాశయంలో ఏర్పడిన గుంతలు
పత్తికొండ మండలంలో పందికోన జలాశయంపై అక్రమార్కుల కన్నుపడింది. పొలాలకు సారవంతమైన మట్టి తరలింపు పేరుతో నిత్యం వందలాది ట్రాక్టర్లతో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా యంత్రాలు పెట్టి రాత్రి సమయాల్లో మట్టి తవ్వి తరలిస్తున్నారు. రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా భయపెట్టి తమ పని కానిచ్చేస్తున్నారు.
న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం
జలాశయానికి పొంచి ఉన్న ముప్పు
తవ్వకాల వద్ద జేసీబీ
పందికోన గ్రామానికి సమీపంలో 1,200 ఎకరాల్లో 1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని ఏర్పాటు చేశారు. రెండు నెలల వరకు జలాశయంలో నీరు సమృద్ధిగా ఉండటంతో అక్రమార్కులు కిమ్మనకుండా ఉన్నారు. వేసవిలో నీటి మట్టం తగ్గటంతో ఖాళీ ప్రదేశంలో మట్టి తవ్వకాలు చేపట్టారు. పెద్ద ఎత్తున తవ్వేయడంతో పలు చోట్ల గుంతలు పడి కరకట్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. మట్టి దందాపై కొందరు రైతులు ఫిర్యాదులు చేసినా స్పందన కరవైంది. ఇప్పటి వరకు వెయ్యి ట్రాక్టర్ల వరకు మట్టి తరలివెళ్లినట్లు అంచనా... తరలింపు ఆపకుంటే జలాశయానికి ముప్పు పొంచి ఉంది. ‘‘ హంద్రీ నీవా జలాశయంలో కొందరు అక్రమంగా మట్టి తవ్వుతున్నారనే సమాచారం వచ్చింది. జలాశయంలో మట్టి తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవు.. ఉన్నతాధికారుల సూచనలతో చర్యలు తీసుకుంటామ’’ని డీఈఈ శంకర్‌రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.