logo

ఉపాధ్యాయ సమస్యలపైనిరంతర పోరాటం

ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టీయూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు.

Published : 10 Jun 2023 02:46 IST

జెండాకు వందనం చేస్తున్న నాయకులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టీయూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పేర్కొన్నారు. నగరంలోని సలాంఖాన్‌ భవనంలో ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలను జిల్లా అధ్యక్షుడు గోకారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న పట్టణ నిరాశ్రయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టీకే జనార్దన్‌, జిల్లా గౌరవాధ్యక్షుడు రమేష్‌ పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు