logo

రీసర్వే త్వరితగతిన పూర్తి చేయండి

భూముల సర్వేపై సర్వేయర్లు, వీఆర్వోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కర్నూలు డివిజన్‌లో రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు.

Updated : 10 Jun 2023 05:00 IST

మాట్లాడుతున్న జేసీ మౌర్య

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: భూముల సర్వేపై సర్వేయర్లు, వీఆర్వోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కర్నూలు డివిజన్‌లో రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై కర్నూలు డివిజన్‌ స్థాయి తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు, వీఆర్వోలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామ, మండల సర్వేయర్లకు భూముల సర్వేపై పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములకు సరిహద్దులు ఏర్పాటు చేయాలని సర్వేయర్లు, వీఆర్వోలకు సూచించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్‌, సర్వే అధికారి రామ్మోహన్‌, డిప్యూటీ కలెక్టర్‌ నాగ ప్రసన్నలక్ష్మి, డీఐ విజయసారథి, తహసీల్దార్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు. 

ఆయకట్టుకు ఇబ్బందులు లేకుండా చూస్తాం

బాధ్యతలు చేపట్టిన రఘురామిరెడ్డి

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: ఆయకట్టు రైతులకు అండగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని డీఈఈ రఘురామిరెడ్డి అన్నారు. జలవనరులశాఖ పరిధిలోని కేసీ కాలువ కర్నూలు సబ్‌ డివిజన్‌ డీఈఈగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సుంకేసుల బ్యారేజీపై శ్రద్ధ వహించి వరద నీటిపై అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. బ్యారేజీ వద్ద నిరంతరం సిబ్బందికి సూచనలు చేయడంతోపాటు పర్యవేక్షణ చేస్తామన్నారు. ఆయకట్టుకు ఇబ్‌్భ రాకుండా చూస్తామని తెలిపారు. నగరం మీదుగా వెళ్లే కేసీ కాలువ పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అంతకుముందు ఆయన సీఈ, ఎస్‌ఈలను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని