యుద్ధ ప్రాతిపదికన వైద్య కళాశాల నిర్మాణం
నంద్యాల వైద్య కళాశాలలో మిగిలిన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రిన్సిపల్‌కు అప్పజెప్పాలని ఏపీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్‌రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇంజినీర్లతో మాట్లాడుతున్న ఏపీఎంఎస్‌ఐడీసీ
మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్‌రెడ్డి
నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : నంద్యాల వైద్య కళాశాలలో మిగిలిన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రిన్సిపల్‌కు అప్పజెప్పాలని ఏపీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్‌రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్‌ఏఆర్‌ఏఎస్ ఆవరణలో జరుగుతున్న మెడికల్ కళాశాల పనులను కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అధ్యాపకుల గది, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ల్యాబ్‌లను పరిశీలించి ఇంజినీర్లకు సూచనలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నంద్యాల మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయన్నారు. వైద్య విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలను దగ్గరుండి సమకూర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డా.స్వర్ణలత, వైస్ ప్రిన్సిపల్ డా.ఆనంద్‌కుమార్‌లకు సూచించారు. జులై 1లోగా ప్రిన్సిపల్ ఛాంబర్‌ను సిద్ధం చేసుకుని అక్కడే విధులు నిర్వహించాలని చెప్పారు. జులై ఒకటో తేదీలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట ఎస్‌ఈ కృష్ణారెడ్డి, ఈఈ శ్రీనివాసులురెడ్డి, ఆసుపత్రి పర్యవేక్షకుడు డా.ప్రసాదరావు, ఇంజినీర్లు, సిబ్బంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Boney Kapoor: శ్రీదేవి మరణం.. డైట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది: బోనీ కపూర్
-
Social Look: సమంత కల.. రుక్సార్ హొయలు.. నిహారిక ఫొటోషూట్
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ