మెరుగైన వైద్య సేవలు అందించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.
కానాలలో వైద్య సేవలు పరిశీలిస్తున్నలెక్టర్ మనజీర్ జిలాని సామూన్
నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. నంద్యాల మండలం చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పోలూరు గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని, కానాల ఆరోగ్య కేంద్రాన్ని, గోస్పాడు పీహెచ్‌సీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ గురించి తెలుసుకున్నారు. అసంక్రమిత వ్యాధుల సర్వే వివరాలు, ఆయుష్మాన్ భారత్ సర్వే దస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్యాధికారి డా.గోపాల్, మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తనూజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా విద్యా కానుక కిట్ల పంపిణీ
నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే : విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు విద్యార్థులకు జగనన్న విద్యా కనుక కిట్లను పంపిణీ చేసేందుకు పకడ్బందీగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎస్పీజీ పాఠశాలలోని మండల స్టాక్ పాయింట్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. యూనిఫామ్‌లు, బ్యాగులు, పుస్తకాలను, బూట్లను పరిశీలించారు. డీఈవో అనురాధ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.