logo

రాష్ట్రంలో అరాచక పాలన

వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగేలా వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 18 Sep 2023 05:34 IST

న్యూస్‌టుడే, ఆలూరు: వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగేలా వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆలూరులో చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్ష ఆదివారం సైతం కొనసాగింది. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడును అరెస్టు చేయించడం ముఖ్యమంత్రి చేసిన పెద్ద తప్పని అన్నారు. సైకో ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొన్నారు. ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు ఆదినారాయణ, ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని