logo

నారీ పరుగుల భేరి

పోలీసుశాఖ ఎస్సై, ఆర్‌ఎస్సై నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. కర్నూలు ఏపీఎస్పీ రెండోపటాలంలో జరుగుతున్న ఈ ప్రక్రియ బుధవారంతో 19వ రోజుకు చేరింది.

Published : 21 Sep 2023 02:14 IST

పరుగు పరీక్షలో అభ్యర్థినులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసుశాఖ ఎస్సై, ఆర్‌ఎస్సై నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. కర్నూలు ఏపీఎస్పీ రెండోపటాలంలో జరుగుతున్న ఈ ప్రక్రియ బుధవారంతో 19వ రోజుకు చేరింది. హాజరైన 1004 మంది పురుషులు, 96 మంది మహిళల ధ్రువీకరణపత్రాలు తనిఖీ చేసి వేలిముద్రలు సేకరించారు. పురుష అభ్యర్థులు ఎత్తు, ఛాతీకొలతలు పరిశీలించగా మహిళా అభ్యర్థినుల ఎత్తు, బరువు పరిశీలించారు. అర్హత సాధించిన వారికి వరుసగా 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ పరీక్షలు నిర్వహించారు. 1600 మీటర్ల పరుగుపరీక్షలో 997 మంది పాల్గొనగా 767 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 100 మీటర్ల పరుగు పరీక్షలో 481 మంది, లాంగ్‌జంప్‌లో 547 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 591 మంది ప్రధాన రాతపరీక్షకు ఎంపికయ్యారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌కుమార్‌, ఎస్పీ జి.కృష్ణకాంత్‌, సెబ్‌ అదనపు ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌, కడప జిల్లా అదనపు ఎస్పీ తుషార్‌డుడీ హాజరై ప్రక్రియను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని