logo

కదిలొస్తున్న అభిమానం

ఆంధ్రప్రదేశ్‌కు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రాలయం తెదేపా బాధ్యుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

Updated : 21 Sep 2023 06:19 IST

కొనసాగుతున్న దీక్షలు
వెల్లువెత్తుతున్న మద్దతు
న్యూస్‌టుడే, మంత్రాలయం

ఆంధ్రప్రదేశ్‌కు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రాలయం తెదేపా బాధ్యుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలో బుధవారం నియోజకవర్గ ఎస్సీ నాయకులు కూర్చున్నారు. అంతకుముందు రాఘవేంద్ర కూడలి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ ఛైర్మన్‌ బత్తిన వెంకటరాముడు,ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి మారెప్ప తదితరులు పాల్గొన్నారు.

బాబు మద్దతుగా సంతకం చేస్తున్న దివ్యాంగుడు కేశన్న, బాబుకు తోడు మేమూ అంటూ ఆదోనిలో సంతకం చేస్తున్న విద్యార్థులు


అభిమాని ‘చూపు’

మద్దికెర మండలం పెరవలికి చెందిన 70 ఏళ్ల బుశప్ప కర్నూలు సర్వజన ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్‌ అనంతరం ఆసుపత్రికి సమీపంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెదేపా నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షల శిబిరానికి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా సంతకం చేశారు.  నందమూరి తారకరామారావుకు వీరాభిమానినని, చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఈనాడు, కర్నూలు


ఆదోనిలో తెదేపా నాయకులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఆదోని నియోజకవర్గ బాధ్యుడు మీనాక్షినాయుడు, తెదేపా సీనియర్‌ నాయకులు ఉమాపతినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే


చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారు.. బాబు నిర్దోషి.. బాబుకు అండగా ఉంటామంటూ రూపొందించిన కరపత్రాలను  ఎమ్మిగనూరు పట్టణంలో పంపిణీ చేసి  అవగాహన కల్పించారు.

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు


మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని తెదేపా బీసీ సెల్‌ కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కోడుమూరులోని పాత బస్టాండులో చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు.

న్యూస్‌టుడే, కోడుమూరు గ్రామీణం


తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ వద్ద కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడు టి.జి.భరత్‌ అధ్యక్షతన 44, 45, 48, 49వ డివిజన్లకు చెందిన తెదేపా కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

కర్నూలు బి.క్యాంప్‌, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని