logo

తగ్గం.. తలొగ్గం

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు.. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు.

Published : 22 Sep 2023 02:47 IST

కొనసాగుతున్న తెదేపా నేతల దీక్షలు
వివిధ వర్గాల మద్దతు

చంద్రబాబుకు మద్దతుగా ఆదోని పట్టణంలో గురవయ్యలు బీరప్ప డోళ్లతో ప్రదర్శన నిర్వహించారు.  

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే


బాబు అరెస్టును అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి

ఆదోని గ్రామీణం: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు.. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు. ఆదోని పట్టణం ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో గురువారం కురవ సోదరులు కూర్చొన్నారు. సీనియర్‌ నాయకులు ఉమాపతినాయుడు , ప్రధాన కార్యదర్శి భూపాల్‌ చౌదరి, నాయకులు లోక్‌నాథ్‌, తిరుపాల్‌ యల్లప్ప, నాగప్ప, రామస్వామి, మాబాషా, మల్లికార్జున తదితరులు ఉన్నారు.


జగన్‌ మెప్పు కోసం.. పదవికి మచ్చ తెచ్చారు

మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెప్పు కోసం అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు నోరు పారేసుకుని మంత్రి పదవికి మచ్చ తెచ్చారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి జలవనరులశాఖ మంత్రి కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు గురువారం ఆయన హాజరైన మాట్లాడారు. నియోజకవర్గ బాధ్యుడు టీజీ భరత్‌ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు చేశారన్నారు. జనసేన మహిళా సాధికారత రాష్ట్ర ఛైర్మన్‌ రేఖ మాట్లాడారు.


చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంత్రాలయంలో రిలే నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. గురువారం కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ముస్లిం నాయకులు దీక్షలో కూర్చున్నారు. మంత్రాలయం, న్యూస్‌టుడే


గోనెగండ్ల: తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం గోనెగండ్లలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు శ్రీరాములు హాజరై మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని