logo

అస్తవ్యస్తం.. శాశ్వత భూహక్కు పత్రం

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తమ భూమిపై శాశ్వత హక్కులు ఉండాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా భూసర్వే చేస్తున్న సంగతి తెలిసిందే.

Published : 22 Sep 2023 02:47 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో నూతనంగా జారీ చేసిన పాస్‌పుస్తకంలో కనిపిస్తున్న 4.11 ఎకరాల భూమి

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తమ భూమిపై శాశ్వత హక్కులు ఉండాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా భూసర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వే ఓ కొలిక్కి వచ్చిందని, రైతులకు ఇక ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్ర స్థాయిలో సర్వే బృందాలు చేసిన తప్పా, లేక అధికారుల తప్పా తెలియదుగానీ.. శాశ్వత భూహక్కు పత్రంగా జారీ చేసిన పాస్‌పుస్తకాల్లో అన్నీ తప్పులే దర్శనమిస్తున్నాయి. గూడూరు మండలంలోని జూలేకల్‌ మజరా గ్రామమైన పొన్నకల్‌ గ్రామంలో ఇటీవల భూసర్వేను అధికారులు పూర్తి చేశారు. ఈ గ్రామానికి చెందిన రైతు గనుమాల చిన్న బజారికి పాత పట్టాదారు పాస్‌ పుస్తకం స్థానంలో నూతనంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో ఉన్న కొత్త పాస్‌ పుస్తకాన్ని అందించారు. కానీ ఇందులో అన్ని తప్పులు ఉండటంతో ఆయన కంగుతిన్నారు. తనకు సర్వే నంబరు 12లో 1.30 ఎకరాల భూమి ఉంటే.. పాస్‌ పుస్తకంలో ఏకంగా 4.11 ఎకరాలు ఉన్నట్లు నమోదు చేశారని ఆయన వాపోతున్నారు.

 న్యూస్‌టుడే, గూడూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని