logo

ఓపీఎస్‌ సాధించే వరకు పోరాటం చేద్దాం

ఓపీఎస్‌ సాధించే వరకు కలసికట్టుగా పోరాటం చేద్దామని ఫ్యాప్టో రాష్ట్ర సహాధ్యక్షుడు ప్రకాశ్‌ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హృదయరాజు పేర్కొన్నారు.

Published : 22 Sep 2023 02:47 IST

ఐక్యత చాటుతున్న ఫ్యాప్టో నేతలు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఓపీఎస్‌ సాధించే వరకు కలసికట్టుగా పోరాటం చేద్దామని ఫ్యాప్టో రాష్ట్ర సహాధ్యక్షుడు ప్రకాశ్‌ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హృదయరాజు పేర్కొన్నారు. నగరంలోని ఎస్టీయూ భవనంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని జీపీఎస్‌ను ఆమోదించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఓపీఎస్‌ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించామన్నారు. 22వ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం.. 23న సాయంత్రం తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు.. 25న చలో కలెక్టరేట్‌ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు గోకారి, సెక్రటరీ జనరల్‌ తిమ్మప్ప, ఏపీటీఎఫ్‌, ఆప్టా నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని