logo

YSRCP: గుప్త నిధుల కోసం వైకాపా నేత ఆధ్వర్యంలో అర్ధరాత్రి తవ్వకాలు

వైకాపా నేత ఆధ్వర్యంలో గుప్త నిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుండగా, గ్రామస్థులు వచ్చి అడ్డుకున్నారు.

Published : 22 Sep 2023 09:56 IST

కల్లూరు: వైకాపా నేత ఆధ్వర్యంలో గుప్త నిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుండగా, గ్రామస్థులు వచ్చి అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని నాయకల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని కాశమ్మ గుడి సమీపంలో గుప్త నిధుల కోసం అర్ధరాత్రి పొక్లెయిన్‌తో తవ్వుతుండగా గ్రామస్థులు అక్కడికి వచ్చి వాహనాన్ని చుట్టుముట్టారు. అనంతరం ఉలిందకొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఎస్సై నల్లప్ప సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గతంలో గ్రామానికి చెందిన వైకాపా నేత చంద్రారెడ్డి ఇదే స్థలంలో తవ్వకాలు జరిపి జైలుకు వెళ్లి వచ్చారని.. ఇప్పుడు కూడా ఆయనే తవ్వకాలు జరిపారని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. పొక్లెయిన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని