logo
Updated : 28/11/2021 13:13 IST

 ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలి 

ఊట్కూరు : ఓటరు నమోదు ప్రక్రియ, జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్ సూచించారు. ఊట్కూరు మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ డాక్టర్‌ చేతనలతో కలసి పోలింగ్‌ బూత్‌లను ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద బీఎల్వోలతో మాట్లాడుతూ కొత్తగా ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తు వివరాలను తెలుసుకొన్నారు. చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్పులు, చేర్పుల విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత వివరాలు నమోదు చేయాలన్నారు. గరుడ యాప్‌ ఉపయోగించడం వల్ల ఓటరు నమోదు, జాబితా సవరణ సులభతరం అవుతుందని చెప్పారు. బీఎల్వోలు, సిబ్బంది ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ప్రత్యేక శిబిరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి.. సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ తిరుపతయ్యకు సూచించారు. గరుడ యాప్‌ వినియోగం పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ రాజ గణేశ్‌, సర్పంచ్‌ సూర్య ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Mahbubnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని