logo
Updated : 30/11/2021 06:06 IST

భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్యాయత్నం

కుటుంబాన్ని చూడాలని ఉందని మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో వినతి

అనిల్‌

నవాబ్‌పేట : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వదిలి పుట్టింటికి వెళ్లిపోయిందని మనస్తాపానికి గురైన భర్త నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఎన్మన్‌బట్ల గ్రామానికి చెందిన కోస్గి యాదయ్య కుమారుడు అనిల్‌(26) మహబూబ్‌నగర్‌లో 2017లో ఇంటర్‌ చదువుతుండగా.. బంధువుల వద్దకు వచ్చిన ఏపీ రాష్ట్రం ప్రకాశం జిల్లా  గిద్దలూరు మండలం ముళ్లపాడుకు చెందిన వైష్ణవిని ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు జన్మించాడు. తగాదాలు రావడంతో అలిగిన భార్య రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. భార్యను పంపమని పలుమార్లు అడిగినా అత్తింటి వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్‌ ఈనెల 25న నిప్పంటించుకొని తీవ్ర గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య, కుమారుణ్ని కడసారి చూడాలని ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో విన్నవించాడు. ఈ విషయమై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడి తల్లి తెలిపారు.

Read latest Mahbubnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని