logo
Published : 01/12/2021 05:16 IST

పెళ్లైన ఆరు రోజులకే మృత్యుఒడిలోకి..

కారు బోల్తాపడి నవ వరుడి దుర్మరణం

సాయిచరణ్‌

పెబ్బేరు, పెంట్లవెల్లి న్యూస్‌టుడే : పెళ్లి పందిరి ఇంకా దించకముందే.. నవ వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకొంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచి శశికళ, భాస్కర్‌ గౌడు దంపతుల కుమారుడు సాయిచరణ్‌ (27)కు నవంబరు 24న వివాహమైంది. కారు సర్వీసింగ్‌ చేయించాల్సి ఉండటంతో మంగళవారం మహబూబ్‌నగర్‌కు కారు తీసుకుని వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో ఫోన్‌ చేసి బయలుదేరుతున్నానని చెప్పిన ఆయన 9.30 దాటినా రాకపోయేసరికి తండ్రి భాస్కర్‌గౌడ్‌ ఫోన్‌ చేశారు. ఎంతకూ ఎత్తకపోవడంతో వాహనం తీసుకుని రోడ్డు వెంట వెదుకుతూ బయలుదేరారు. రాత్రి 10.30 గంటల సమయంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి సమీపంలో కారు అదుపు తప్పి బోల్తాపడిన విషయం గమనించారు. దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే సాయిచరణ్‌ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా పెబ్బేరు ఎస్సై రామస్వామి అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. వివాహమై ఆరు రోజులు గడవకముందే వరుడు చనిపోవడంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read latest Mahbubnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని