logo

బతికున్న కుమార్తెకు దినకర్మ

బతికున్న కుమార్తెకు తండ్రి దినకర్మ నిర్వహించిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల

Published : 17 Jan 2022 01:48 IST

వద్దన్నా.. వివాహం చేసుకుందని ఆగ్రహం

చిన్నచింతకుంట, న్యూస్‌టుడే : బతికున్న కుమార్తెకు తండ్రి దినకర్మ నిర్వహించిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి తన మేనత్త కుమారుడిని ఈ నెల 13న ప్రేమ వివాహం చేసుకుంది. తల్లిదండ్రులు ఆదివారం కుమార్తె వద్దకు వెళ్లి ఆమె ప్రేమించిన యువకుడితోనే వివాహం చేస్తామని ఇంటికి వచ్చేయమని కోరారు. కనీసం నిశ్చితార్థం అయినా చేస్తేనే వెంట వస్తానని యువతి చెప్పింది. ఆగ్రహంతో ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె ఈ నెల 13న మృతి చెందినట్లు చిత్రపటంతో ఫ్లెక్సి తయారు చేయించి దినకర్మ నిర్వహించారు. కుమార్తె జ్ఞాపకాలు ఇంట్లో ఉండొద్దని ఆమె దుస్తులు కూడా దహనం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని