logo

కృష్ణానది ఒడ్డున కోళ్లపందేలు

సంక్రాంతి పర్వదినాన ఇటిక్యాల మండలంలోని షేక్‌పల్లి శివారులో కోళ్ల పందాలు జోరుగా సాగాయి. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో షేక్‌పల్లి, సాసనూలు శివారులోని కృష్ణానది ఒడ్డున కోళ్ల పందాలను ఏర్పాటు చేశారు. భోగి

Published : 17 Jan 2022 01:48 IST

పోలీసుల దాడి 

పందెంరాయుళ్లను పట్టుకున్న పోలీసులు

ఇటిక్యాల, న్యూస్‌టుడే : సంక్రాంతి పర్వదినాన ఇటిక్యాల మండలంలోని షేక్‌పల్లి శివారులో కోళ్ల పందాలు జోరుగా సాగాయి. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో షేక్‌పల్లి, సాసనూలు శివారులోని కృష్ణానది ఒడ్డున కోళ్ల పందాలను ఏర్పాటు చేశారు. భోగి పండుగ రోజునే ప్రారంభమైన కోళ్ల పందాలకు ఇటిక్యాల మండలంతోపాటు కర్నూలు, కర్ణాటక నుంచి పందెంరాయుళ్లు తరలివచ్చారు. శనివారం కోళ్లపందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుకున్న కోదండాపురం ఎస్సై వెంకటస్వామి సిబ్బందితో దాడులు నిర్వహించారు. పదుల సంఖ్యలో పందెంరాయుళ్లతోపాటు తిలకించేందుకు వందల సంఖ్యలో చుట్టుప్రక్కల ప్రాంతం నుంచి తరలివచ్చిన ప్రజలను చూసిన పోలీసు సిబ్బంది అదనపు సిబ్బందిని రప్పించుకుని దాడులు నిర్వహించారు. 20 మంది పందెంరాయుళ్లతోపాటు 16 పందెంకోళ్లు, 19 కత్తులతోపాటు రూ.87,510 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్వాహకుడు ఎంపీపీ భర్త కావడం గమనార్హం. నిర్వాహకుడు శ్రీధర్‌తోపాటు పందెంరాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని